ఒంటిపై రంగులతో చూడముచ్చటగా ఉన్న ఈ రొయ్య విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరులో చిక్కింది. సోమవారం వేటకు వెళ్ళిన మత్స్యకారుడు ఎర్రోడు తాత వలకు ఈ రంగు రొయ్య చిక్కింది. సుమారు రెండు కిలోలు ఉన్న దీని ధర బయట మార్కెట్లో రూ.మూడు వేలకు పైగా ఉంటుందని చెబుతున్నారు.
రంగుల రొయ్య..... చిక్కెనయ్య - chepalakancheru color prawn
ఏపీలోని విజయనగరం జిల్లా చేపలకంచేరు మత్స్యకారుడి వలకు రంగులతో ఉన్న రొయ్య చిక్కింది. దీని విలువ మార్కెట్లో సుమారు రూ.మూడు వేలకు పైగా ఉంటుందని మత్స్యకారుడు ఆనందం వ్యక్తం చేశాడు.
రంగుల రొయ్య..... చిక్కెనయ్య
దీనిపై మత్స్య శాఖ ఏడి సుమలత మాట్లాడుతూ సముద్రపు అడుగు భాగంలో రాళ్ల మధ్య ఎక్కువగా ఉండే వీటిని రాతి రొయ్యలు అంటారని తెలిపారు. అలల తాకిడితో అరుదుగా బయటకు వస్తాయని వివరించారు.