చలికి వణుకుతున్న తెలంగాణ ప్రజలకు రాగల మూడ్రోజులు ఉపశమనం లభించనుంది. రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి తెలిపారు.
రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం - cold will decrease in telangana in coming three days
రాష్ట్రంలో రాగల మూడ్రోజులు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమ, మంగళ వారాల్లో ఒకట్రెండు ప్రదేశాల్లో సాధారణం కంటే 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది.
![రానున్న మూడ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం cold will decrease in telangana in coming three days](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9955024-818-9955024-1608545909942.jpg)
తెలంగాణలో పొడి వాతావరణం
మంగళవారం నాడు ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశముందని వెల్లడించారు. ప్రధానంగా ఉత్తర, ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. సోమ, మంగళ వారాల్లో ఒకట్రెండు ప్రదేశాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 4 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
- ఇదీ చూడండి :మహానగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చలి