తగ్గుతున్న ఉష్ణోగ్రత.. పెరుగుతున్న చలి.. - Hyderabad Meteorological Center
తెలంగాణలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. క్రమంగా చలి తీవ్రత పెరుగుతోందని వెల్లడించారు.
తెలంగాణలో పెరుగుతున్న చలి
రాష్ట్రంలో చలిపెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా కొహీర్‌లో అత్యల్పంగా 13.2, ఆదిలాబాద్‌లో 15.8, హైదరాబాద్‌లో 17.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో ఇవే ఇప్పటివరకూ అత్యల్ప ఉష్ణోగ్రతలు. తెలంగాణలో మంగళ,బుధవారాల్లో పగలు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.
- ఇదీ చూడండి :వరద ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం