తెలంగాణ

telangana

ETV Bharat / city

అరుంధతి రేంజ్​లో తలలపై పగిలిన కొబ్బరికాయలు - వింత ఆచారం

మీకు అరుంధతి సినిమాలో అనుష్క తలపై కొబ్బరి కాయలు పగలగొట్టే సీన్ గుర్తుందా.. అచ్చం అలాగే ఆ ఊళ్లల్లో మెుక్కులు చెల్లించుకుంటారు. ఆ సీన్ చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. అయినా.. అదంతా భక్తిలో ఓ భాగమనే అంటారు ఆ గ్రామస్తులు.

coconuts breaks on devotees heads
తలలు పగిలేలా మొక్కులు.. అంతా భక్తిలో భాగమే!

By

Published : Mar 13, 2021, 11:07 AM IST

ఏపీలోని చిత్తూరు జిల్లా శాంతిపురం, కుప్పం మండలాల పరిధిలో మహా శివరాత్రి పూజలు శ్రద్ధగా నిర్వహిస్తుంటారు. కానీ.. శ్రీసిద్ధేశ్వరస్వామి వారి మెుక్కులు చెల్లించుకునేందుకు.. భక్తులు తలపై కొబ్బరికాయలు పగులగొట్టి ప్రత్యేక పూజలు చేశారు.

తలలు పగిలేలా మొక్కులు.. అంతా భక్తిలో భాగమే!

కదిరిముత్తునపల్లె, హనుమాన్ కోటాల గ్రామాల్లో దేవర ఎద్దుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు.. ఆనవాయితీ ప్రకారం ఎద్దుతో పాటు భక్తుల తలపై కొబ్బరి కాయలను పగులగొట్టారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు గ్రామస్తులతో పాటు, భక్తుల కుటుంబీకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇవీ చూడండి:నేటి నుంచి ఫాల్గుణ మాసం.. మహా విష్ణువును ప్రీతికరం..

ABOUT THE AUTHOR

...view details