తెలంగాణ

telangana

ETV Bharat / city

kodi pandelu: కాసులు కురిపించిన కోడి పందేలు - ap news

kodi pandelu: సంక్రాంతి వేళ.. ఏపీలో మూడురోజుల పాటు సాగిన కోడిపందేలు నిర్వాహకులకు కాసులు కురిపించాయి. చివరి రోజు మరింత రసవత్తరంగా సాగిన పందేల్లో భారీగా పందెం రాయుళ్లు పాల్గొన్నారు. మరోపక్క జూదం, పేకాట జోరుగా సాగింది. ఈ పందేలను చూసేందుకు తెలంగాణ నుంచి భారీగా జనాలు తరలివెళ్లారు.

cockfight, కోడి పందేలు
cockfight

By

Published : Jan 17, 2022, 7:43 AM IST

kodi pandelu: కాసులు కురిపించిన కోడి పందేలు

kodi pandelu: సంక్రాంతి వేడుకల్లో చివరి రోజైన కనుమ నాడూ కోడి పందేలు జోరుగా సాగాయి. ఏపీలోని కృష్ణా జిల్లాలో కోడి పందేలకు పేరుగాంచిన అంపాపురం, ఈడుపుగల్లుతోపాటు, కంకిపాడు, విజయవాడలోని భవానీపురంలో భారీస్థాయిలో బరులు ఏర్పాటుచేశారు. ఒక్కొక్క పందెం కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ముగియడంతో... కోట్ల రూపాయలు చేతులు మారాయి. చాలాచోట్ల నోట్లకట్టలు లెక్కపెట్టేందుకు ప్రత్యేకంగా యంత్రాలను ఏర్పాటు చేశారంటే.. పందేలు ఏ స్థాయిలో సాగాయో అర్థం చేసుకోవచ్చు. ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి మరీ.. రాత్రి పూట కూడా జోరుగా పందేలు నిర్వహించారు.

తిరనాళ్లను తలపించాయి..

ఈడుపుగల్లు, కంకిపాడు, భవానీపురం సహా అంపాపురంలో ఏర్పాటు చేసిన బరులకు వివిధ ప్రాంతాల నుంచి పందెంరాయిళ్లు భారీగా వచ్చారు. ఈడుపుగల్లులో వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయటంతో పాటు వీక్షకుల కోసం ఎల్ఈడీ తెరలను అందుబాటులో ఉంచారు. ఈ ప్రాంగణాలు మూడు రోజుల పాటు తిరనాళ్లను తలపించాయి. వందలాది వాహనాలు బారులు తీరాయి. బరుల ప్రాంతాలన్ని కిక్కిరిసిపోయాయి. కృష్ణా జిల్లా నందిగామ కంచికర్ల పెండ్యాలలో పెద్ద ఎత్తున జూదం నడిచింది. ఏడాదికి.. ఒక్కసారి వచ్చే సంక్రాంతి పండుగకు మాత్రమే కోడి పందెలు నిర్వహించుకుంటామని నిర్వాహకులు, పందెం రాయుళ్లు తెలిపారు. వీటిని జూదంలా చూడొద్దని.. కేవలం సరదా కోసమే ఆడుతామన్నారు.

200 కోట్లు చేతులుమారాయి..

కోడి పందేలకు ప్రసిద్ధి చెందిన గోదావరి జిల్లాల్లోనూ చివరి రోజూ పోటీలు రసవత్తరంగా సాగాయి. కాట్రేనికోన, ఐ పోలవరం, ముమ్మిడివరం, తాళ్ళరేవు మండలాల్లో బరులు తిరనాళ్లను తలపించాయి. పోలీసుల ఆంక్షలు, కరోనా వల్ల పందేలు ఏలా జరుగుతాయో అని భావించిన పందెం రాయుళ్లకు.. ఆశించిన మేర ఫలితాలొచ్చాయని నిర్వాహకులు తెలిపారు. గడిచిన మూడు రోజుల్లో గోదావరి జిల్లాల్లో 200 కోట్ల రూపాయల పైనే చేతులు మారాయని అంచనా.

ఇదీచూడండి:komuravelli mallanna jathara: వైభవంగా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details