తూర్పు ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశానికి చెందిన ఓ వ్యక్తి ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. రూ.10 కోట్ల విలువ చేసే 1.02 కేజీల కొకైన్ ఇతని వద్ద పట్టుబడింది. నిందితుడు ఫ్యూమో ఇమాన్యుయేల్ జెడెక్వియాస్ ఈ మత్తు పదార్థాన్ని క్యాప్సూల్స్ రూపంలో పొట్టలో దాచుకొన్నట్టు మాదకద్రవ్యాల నిరోధక విభాగం మంగళవారం తెలిపింది.
drugs: పొట్టలో రూ.10 కోట్ల విలువైన కొకైన్ - మత్తు పదార్థాలు స్వాధీనం
మత్తు పదార్థాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తి ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. 1.02 కేజీల డ్రగ్స్‌ను పొట్టలు దాచుకొని తరలిస్తున్నట్లు మాదకద్రవ్యాల నిరోధక విభాగం తెలిపింది.
cocaine
కొకైన్‌తో నింపిన 70 క్యాప్సూళ్లను ఇతడు మింగినట్లు విచారణలో తెలిసింది. వెంటనే అతణ్ని బైకుల్లాలోని జేజే ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పలుమార్లు ప్రయత్నించి కొకైన్ క్యాప్సూళ్లను వెలికితీశారు. అది దక్షిణ అమెరికాకు చెందిన కొకైన్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:కి'లేడి' వలలో అమాయక యువకులు.. హెచ్చార్సీకి బాధితుని తండ్రి ఫిర్యాదు.!