తెలంగాణ

telangana

ETV Bharat / city

మెుదట పరిగెత్తారు.. ఆ తర్వాత దండాలు పెట్టారు! - snake in pasarlapadu latest news

మెుదట మూలన నక్కి ఉన్న పామును చూసి తలో దిక్కుకు పారిపోయారు.. పాములు పట్టేవారికి సమాచారం అందించటంతో.. అతను వచ్చి పామును బంధించాడు. అనంతరం పాముని పట్టుకొని దండాలు పెట్టేశారు..

cobra at pasalapudi
మెుదట పరిగెత్తారు.. ఆ తర్వాత దండాలు పెట్టారు!

By

Published : Apr 23, 2021, 4:45 PM IST

ఉక్కపోతకు తట్టుకోలేక పాములు నివాస ప్రాంతాల్లోకి వచ్చేస్తుండటంతో.. జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పాశర్లపూడి సమీపంలోని ఓ ఉడ్‌ వర్క్‌ దుకాణంలో ఓ మూలన నక్కి ఉన్న నల్లతాచును చూసి కార్మికులు హడలెత్తిపోయారు.

అక్కడినుంచి దూరంగా పారిపోయారు. వెంటనే పాములు పట్టేవారిని పిలిపించి...దాన్ని బంధించారు. చుట్టూ ఉన్న స్థానికులు వచ్చి ఆసక్తిగా పామును చూశారు. పామును పట్టుకుని మరీ దండాలు పెట్టేశారు.

మెుదట పరిగెత్తారు.. ఆ తర్వాత దండాలు పెట్టారు!

ఇదీ చదవండి: అతని కోరికను కాదన్నానని ఫోన్లలో వేధించేవాడు!

ABOUT THE AUTHOR

...view details