జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దిల్లీకి తిరుగు పయనం కానున్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నిజ నిర్ధారణకు వచ్చిన బృందం... నాలుగు రోజులపాటు పలు అంశాలపై వివరాలు సేకరించారు. సంఘటనా స్థలంతోపాటు మృతదేహాలను బృందం పరిశీలించింది. మృతుల కుటుంబ సభ్యులతోపాటు దిశ తండ్రి, చెల్లితోనూ వివరాలు సేకరించారు.
'దిశ' కేసులో కీలక సాక్ష్యాలు... దిల్లీకి ఎన్హెచ్ఆర్సీ బృందం - co,plete nhrc team hyderabad tour
దిశ ఎన్‌కౌంటర్‌పై విచారణ చేసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఏడుగురు సభ్యుల జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం పర్యటన ముగిసింది. పూర్తి స్థాయి నివేదికను ఎన్హెచ్ఆర్సీకి సమర్పించనుంది. కోరితే సుప్రీంకోర్టుకు కూడా నివేదిక అందించేందుకు బృందం సిద్ధంగా ఉంది.
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలను సేకరించడంతోపాటు పంచనామా నిర్వహించిన తహసీల్దార్లను ప్రశ్నించారు. మృతులకు డీఎన్ఏ, ఫోరెన్సిక్ నివేదికను ఇంకా రానందున... వాటిని పోస్ట్‌లో దిల్లీకి పంపించాలని సైబరాబాద్ పోలీసులను ఆదేశించారు. పూర్తిస్థాయి నివేదికను మానవ హక్కుల కమిషన్‌కు సమర్పించనున్నారు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే... ఉన్నత న్యాయస్థానానికి నివేదక అందింజేసేందుకు నిజనిర్దారణ కమిటీ సిద్ధంగా ఉంది.
ఇదీ చూడండి: షాద్‌నగర్ కేసులో కీలకమలుపు... 'అస్థీకరణ'తోనే అసలు నిజం!