తెలంగాణ

telangana

ETV Bharat / city

పుర ప్రచారానికి సీఎం కేసీఆర్​ దూరం..! - telangana municipal election latest

మున్సిపల్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. మున్సిపల్‌ ఎన్నికల బాధ్యతలను ఇప్పటికే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అప్పగించారు. ఈ మేరకు పార్టీ వర్గాలకు సమాచారం అందించారని తెలిసింది.

"పుర" ప్రచారానికి సీఎం దూరం..!
"పుర" ప్రచారానికి సీఎం దూరం..!

By

Published : Dec 29, 2019, 9:02 AM IST

పురపాలక, నగరపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ వర్గాలకు సమాచారం అందించారని తెలిసింది. గత జూన్‌లో జరిగిన మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు.

ఎన్నికలపై దిశానిర్దేశం..!

జనవరి రెండో తేదీన తెలంగాణభవన్‌లో నిర్వహించే పార్టీ శాసనసభాపక్ష, రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎన్నికలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మున్సిపల్‌ ఎన్నికల బాధ్యతలను ఇప్పటికే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అప్పగించారు. ఆయన పది నగరపాలక సంస్థలు, పెద్ద పురపాలక సంఘాల ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారని తెలిసింది. ఉమ్మడి జిల్లాల వారీగా సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి వాటిలో పాల్గొనే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాడండి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details