CM Jagan Review on Ports And Airports: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాలు నిర్మించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. జిల్లాకో విమానాశ్రయం ఉండాలనేది మంచి ఉద్దేశమన్నారు. ఇందులో అన్ని రకాల మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. బోయింగ్ విమానాలూ దిగేలా రన్‌వే అభివృద్ధి చేయాలని సూచించారు. పోర్టులు, విమానాశ్రయాలపై సమీక్షించిన సీఎం.. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి గౌతమ్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిర్ణీత వ్యవధిలోగా
రాష్ట్రంలోని 6 విమానాశ్రయాల విస్తరణతో పాటు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్న ఆయన.. భోగాపురం, దగదర్తి విమానాశ్రయాలు వేగంగా పూర్తికావాలని స్పష్టం చేశారు. నిర్వహణలోని విమానాశ్రయాల పనులు ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని.. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. నిర్ణీత వ్యవధిలోగా పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని.. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!