రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండి, పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నామని జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సీఎం కేసీఆర్... సీఎండీ ప్రభాకర్ రావుతో మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ విషయంలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని సీఎండీని ఆదేశించారు.
చాలా చోట్ల విద్యుత్ శాఖకు భారీ నష్టం జరిగిందని.. విద్యుత్ పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారని... వందశాతం పునరుద్ధరణ జరిగే వరకు విద్యుత్ శాఖ ఇదే స్పూర్తి కొనసాగించాలని ముఖ్యమంత్రి సీఎండీని ఆదేశించారు.