తెలంగాణ

telangana

ETV Bharat / city

AP CM Jagan Serious: విశాఖలో ట్రాఫిక్‌ నిలిపివేతపై జగన్ సీరియస్​ - సీఎం జగన్ వార్తలు

AP CM Jagan Serious: విశాఖ పర్యటనలో ట్రాఫిక్‌ ఆంక్షలపై ఏపీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్‌ ఎందుకు నిలిపివేశారని, ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ట్రాఫిక్‌ జామ్‌ సహా ప్రజలకు ఇతర అసౌకర్యాలపై విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారు. బుధవారం విశాఖ శారదాపీఠాన్ని సీఎం సందర్శించిన జగన్‌.. సుమారు మూడున్నర గంటలపాటు అక్కడే ఉన్నారు.

AP CM Jagan Serious: విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు... ఏపీ సీఎం జగన్ ఆగ్రహం
AP CM Jagan Serious: విశాఖలో ట్రాఫిక్‌ ఆంక్షలు... ఏపీ సీఎం జగన్ ఆగ్రహం

By

Published : Feb 10, 2022, 11:40 AM IST

AP CM Jagan Serious: ఏపీలోని విశాఖ పర్యటనలో ట్రాఫిక్‌ ఆంక్షలపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గంటల తరబడి ట్రాఫిక్‌ ఎందుకు నిలిపివేశారని, ప్రజలను ఎందుకు ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వెలిబుచ్చారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ట్రాఫిక్‌ జామ్‌ సహా ప్రజలకు ఇతర అసౌకర్యాలపై విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారు.

బుధవారం విశాఖ శారదాపీఠాన్ని సీఎం సందర్శించిన సీఎం జగన్‌.. సుమారు మూడున్నర గంటలపాటు అక్కడే ఉన్నారు. ముఖ్యమంత్రి అక్కడ ఉన్నంత సేపు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. మద్యం దుకాణం మినహా అన్ని షాపులు మూసేయించారు. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

కిలోమీటర్ల మేర నిలిచి వాహనాలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది. మూడు గంటల పాటు ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదని నగర ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండుటెండలో ఎక్కడికక్కడ రోడ్డు మీద ఆపేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ బుధవారం విశాఖ శారదా పీఠం వార్షిక వార్షికోత్సవాలకు హాజరుకావడానికి షెడ్యూలు ప్రకారం ఉదయం 11 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉండగా 11.45కు వచ్చారు. మధ్యాహ్నం 1 గంటకు తిరిగి బయల్దేరాల్సి ఉండగా.. సాయంత్రం 4 వరకు అక్కడే ఉన్నారు.

హారన్లు మోగిస్తూ అసంతృప్తి

అయితే.. తిరుగు ప్రయాణంపై స్పష్టత లేకపోవడంతో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపేశారు. ఎన్‌ఏడీ కూడలి నుంచి పెందుర్తి, కంచరపాలెం, గాజువాక, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వైపు మార్గాల్లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎన్‌ఏడీ పైవంతెన కింది భాగం వాహనాలతో కిక్కిరిసిపోయింది. అత్యవసర పనులు, ఆసుపత్రులకు వెళ్లేవారు వాహనాలు దిగి నడుచుకుంటూ వెళ్లారు. వాహనదారులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. హారన్లు మోగిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details