హైదరాబాద్ నగర శివారులోని శేరిలింగంపల్లిలో హుస్సేనాబాద్ హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసిన స్థలాన్ని రెగ్యులర్ చేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ముఖ్యమంత్రి కార్యదర్శి నర్సింగరావు పేరుతో ఒక లేఖను సృష్టించారు . ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ లేఖను పరిశీలించిన రెవెన్యూ శాఖ అధికారులు రెండురోజుల క్రితం ఈ విషయాన్ని నర్సింగరావు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన తాను ఎలాంటి లేఖ రాయలేదంటూ రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. తన లేఖను సృష్టించడంతోపాటు సంతకాన్ని ఎవరు ఫోర్జరీ చేశారో తెలుసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టాలని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీస్)లో ఫిర్యాదు చేశారు. జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కార్యదర్శి పేరుతో లేఖ కలకలం - ముఖ్యమంత్రి కార్యదర్శి పేరుతో లేఖ కలకలం
ముఖ్యమంత్రి కార్యదర్శి నర్సింగరావు పేరుతో ఓ లేఖ కలకలం సృష్టించింది. హుస్సేనాబాద్ హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేసిన స్థలాన్ని రెగ్యులర్ చేయాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పని చేశారు. విషయం తెలుసుకున్న ఆయన తాను ఎటువంటి లేఖ రాయలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి కార్యదర్శి పేరుతో లేఖ కలకలం