వీసీల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం - cm kcr on vice chancellors
![వీసీల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం cm kcr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6124946-350-6124946-1582098197800.jpg)
13:07 February 19
వీసీల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వీసీల నియామకానికి ముందు సెర్చ్ కమిటీల నుంచి పేర్లు తెప్పించుకోవాలని చెప్పారు.
ముందుగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల నియామకాలు సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తద్వారా ఉపకులపతుల నియామక ప్రక్రియకు మార్గం సుగమమం అవుతుందని అన్నారు. రానున్న రెండు, మూడు వారాల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.