తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై రేపు సీఎం సమావేశం - తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు

Independent India's Diamond jubilee : తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో 15 రోజులపాటు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ భేటీలో వజ్రోత్సవాల కోసం ఏర్పాటు చేసిన కమిటీతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఉత్సవాల కార్యాచరణ, విధి విధానాలపై చర్చించనున్నారు.

Independent India's Diamond jubilee
Independent India's Diamond jubilee

By

Published : Aug 1, 2022, 6:59 AM IST

75th Independence day celebrations in Telangana : రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యాచరణ, విధి విధానాలు సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించనున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని కోసం తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అధ్యక్షతన ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో సీఎం సమావేశమవుతారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.

హైదరాబాద్‌ చేరుకున్న సీఎం..ఆరు రోజుల దిల్లీ పర్యటనను ముగించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించిన సీఎం.. ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయి రాజకీయాంశాలపై చర్చించారు. రైతు సంఘాల నేతలు, ఆర్థిక నిపుణులతో పాటు ప్రముఖ జర్నలిస్టులతోనూ ఆయన భేటీ అయ్యారు.

75th Independence day celebrations : మరోవైపు.. ఆగస్టు 2 నుంచి 15 వరకు.. ప్రజలందరూ తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రొఫైల్ పిక్​గా జాతీయ జెండా ఫొటోను పెట్టుకోవాలని మోదీ కోరారు. "ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు 'హర్​ ఘర్​ తిరంగా' పేరుతో ప్రత్యేక ఉద్యమం నిర్వహిస్తున్నాం. ఆ మూడు రోజులు.. ప్రతి ఇంటి వద్ద జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోండి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో మనమందరం ఒక అద్భుతమైన, చరిత్రాత్మక ఘట్టాన్ని చూడబోతున్నాం. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవాల్లో ఏదో రూపంలో పాల్గొంటున్నారు." అని మోదీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details