మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR wishes on Milad Un Nabi) శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజైన మిలాద్ ఉన్ నబీని భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని ఆకాంక్షించారు. దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వమానవ సమానత్వం, ఐకమత్యం వంటి ప్రవక్త బోధనలు మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు.
CM KCR wishes on Milad Un Nabi : మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ - telangana top news
మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR wishes on Milad Un Nabi) శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరిలో ప్రేమ, సోదరభావం ఉండాలని మహ్మద్ ప్రవక్త బోధించారని అన్నారు. ప్రవక్త బోధనలు మానవాళికి అనుసరణీయమని చెప్పారు. మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘మానవాళికి మహమ్మద్ ప్రవక్త అందించిన బోధనలు అమూల్యమైనవి. ప్రేమ, సోదరభావం, ధర్మ చింతన ప్రతి మానవుడిలో ఉండాలని చెప్పిన మహ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు’’ అని కేసీఆర్(CM KCR wishes on Milad Un Nabi) తెలిపారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముస్లింలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్తి పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ మిలాద్ ఉన్ నబీ అని రేవంత్ అన్నారు. తెలంగాణలో ముస్లింలు ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.