యాసంగి ధాన్యం కొనుగోళ్ల(paddy procurement in telangana)పై కేంద్రం నుంచి స్పష్టత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ(CM KCR Delhi Tour) వేదికగా కార్యచరణ ముమ్మరం చేశారు. యాసంగిలో ఎంత మేర వడ్లు కొంటారో తేల్చడంతో పాటు.. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, కృష్ణా, గోదావరి జలాల్లో(krishna godavari water dispute) రాష్ట్ర వాటాను పక్కాగా కేటాయించాలన్న అంశాన్ని దిల్లీ పెద్దల వద్ద ప్రస్తావించనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ హస్తినకు వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ, పౌరసరపరాల శాఖ మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తదితరులు బయలుదేరి వెళ్లారు.
హస్తినలోనే శుక్రవారం దాకా..
3 నుంచి 4 రోజులు హస్తినలోనే ఉండి.. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్‌లను కేసీఆర్ కలవనున్నారు. రాష్ట్ర మంత్రులు తొలుత పీయూష్ గోయల్‌ను కలిసి చర్చిస్తారు. అనంతరం ప్రధానితో సీఎం భేటీ అవుతారు. ప్రధాని మోదీని కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే అనుమతి కోరింది. భేటీల నేపథ్యంలో శుక్రవారం వరకూ ముఖ్యమంత్రి దిల్లీలోనే ఉంటారని తెలిసింది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు కేంద్రం చేపట్టాలంటూ... ఇందిరాపార్కు వద్ద స్వయంగా కేసీఆర్ ధర్నా చేపట్టారు. ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం నుంచి వెలువడ్డ ప్రకటనపైనా మరింత స్పష్టత కోరనున్నారు. ఆ మేరకు యాసంగిలో ఏ పంట వేయాలో రైతులకు సీఎం సూచించే అవకాశం ఉంది.
మిగతా అంశాల ప్రస్తావన..