KCR Up Tour: సీఎం కేసీఆర్ నేడు ఉత్తరప్రదేశ్‌కు వెళ్లనున్నారు. స్వర్గస్తులైన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరుకానున్నారు. ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయకు ఈరోజు మధ్యాహ్నం సీఎం చేరుకుంటారు. దివంగత ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పిస్తారు. అనంతరం అంత్యక్రియల్లో సీఎం కెసిఆర్ పాల్గొననున్నారు.
కాసేపట్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు బయలుదేరనున్న సీఎం కేసీఆర్
13:16 October 10
యూపీకి సీఎం కేసీఆర్
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ములాయం జీవితాంతం బడుగు, బలహీన వర్గాల కోసమే పనిచేశారని కొనియాడారు. రాంమనోహర్ లోహియా వంటి నేతల స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. ములాయం కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అంటూ ములాయం సింగ్ యాదవ్ మరణంపై మంత్రి కేటిఆర్ ట్విటర్‌లో స్పందించారు. కుమారుడు అఖిలేష్ యాదవ్‌కు, ఆయన కుటుంబసభ్యులకు. ట్విటర్ ద్వారా సంతాపం తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని సంతాపం తెలిపారు.
నేను ఉదయం ములాయంసింగ్ యాదవ్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హరియాణా గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో మరణించారు. ఆరోగ్య సమస్యల రీత్యా ఆగస్టు 22న ఆస్పత్రిలో చేరిన ములాయం.. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల సోమవారం కన్నుమూశారు. ములాయం కుమారుడు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
ఇవీ చదవండి: