వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కరోనా చికిత్సలో ఉపయోగించే రెయ్ డిస్ట్రిర్, టోసిలిజుమాబ్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత రానివ్వవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వాటిని పెద్ద మెత్తంలో సిద్ధంగా పెట్టుకొని, కావాల్సిన వారికి ఉచితంగానే అందించాలని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు పడకల కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. పడకల వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి వెల్లడించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
10శాతం అదనపు వేతనం..