తెలంగాణ

telangana

ETV Bharat / city

CM KCR TOUR: రేపు, ఎల్లుండి జనగామ, యాదాద్రి జిల్లాల్లో సీఎం పర్యటన - ముఖ్యమంత్రి కేసీఆర్‌

CM KCR visits Jangaon and Yadadri districts: నూతనంగా నిర్మించిన మరో రెండు కలెక్టరేట్‌ భవనాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

CM KCR TOUR
CM KCR TOUR

By

Published : Feb 10, 2022, 5:10 AM IST

Updated : Feb 10, 2022, 6:27 AM IST

Jangaon and Yadadri districts Collectorate buildings: జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలలో నూతనంగా నిర్మించిన మరో రెండు కలెక్టరేట్‌ భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అన్ని జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో నిర్వహించేందుకు సర్కారు నూతన భవన సముదాయాలను నిర్మిస్తోంది. ఇప్పటికే కొన్ని ఉపయోగంలోకి వచ్చాయి. మరో ఆరు జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయి.

శుక్రవారం జనగామలో ఈ సముదాయాన్ని, తెరాస జిల్లా కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శనివారం భువనగిరిలో కలెక్టరేట్‌ భవనాలను, యాదాద్రి ఆలయ పునర్‌ నిర్మాణంలో భాగంగా నూతనంగా కట్టిన ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

ఇదీ చూడండి:KTR Comments: 'గుజరాత్ కంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మోదీకి కడుపుమంట'

Last Updated : Feb 10, 2022, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details