CM KCR Kolhapur Visit : మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. కుటుంబ సమేతంగా కొల్హాపూర్ వెళ్లిన కేసీఆర్.. అక్కడ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. సీఎం కుటుంబానికి ఆలయ అర్చకులు మర్యాదగా స్వాగతం పలికారు. మహాలక్ష్మి అమ్మవారికి కేసీఆర్.. తన కుటుంబ సభ్యులతో సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అందజేసిన తీర్థప్రసాదాలను స్వీకరించారు.
CM KCR Kolhapur Visit : 'దేశం ప్రగతి పథంలో సాగాలని అమ్మవారిని వేడుకున్నా' - కొల్హాపూర్ అమ్మవారికి కేసీఆర్ పూజలు
CM KCR Kolhapur Visit : మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. హైదరాబాద్ బేగంపేట నుంచి కుటుంబ సమేతంగా కొల్హాపూర్ వెళ్లిన కేసీఆర్‌ను విమానాశ్రయంలో అధికారులు ఘనంగా స్వాగతించారు. అనంతరం ఆయన మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూ జలు నిర్వహించారు.
CM KCR Kolhapur Temple Visit : "లక్ష్మీదేవికి ప్రత్యేకించి వున్న ఆలయాలలో కొల్హాపూర్ ఆలయం ముఖ్యమైంది. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుని ఆమె దీవెనలను కోరుకుంటారు. చాలా రోజుల నుంచి నేను ఈ కోవెలకు వద్దామని.. అమ్మ ఆశీస్సులు తీసుకుందామని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. దేశం అభివృద్ధి పథంలో సాగాలని.. రైతులు ఆనందంగా ఉండాలని.. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మను కోరుకున్నాను."
- కేసీఆర్, ముఖ్యమంత్రి
- ఇదీ చదవండి :అంగరంగవైభవంగా యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు