తెలంగాణ

telangana

ETV Bharat / city

KCR: సినారె అజరామరం.. ఆయన సాహిత్యం విశ్వంభరం - cnare death anniversary updates

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య సి. నారాయణ రెడ్డి వర్థంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఘన నివాళులు అర్పించారు. సాహిత్యానికి సినారె చేసిన సేవలను గుర్తు చేసుకున్న సీఎం... భాషా, సాహిత్యాలు నిలిచి ఉన్నన్ని రోజులు... ప్రజల హృదయాల్లో సినారె బతికే ఉంటారన్నారు.

cm kcr tribute to cnare on his death anniversary
cm kcr tribute to cnare on his death anniversary

By

Published : Jun 12, 2021, 1:30 PM IST

తెలంగాణ సాహితీ సౌరభాలను విశ్వంభరావ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య సి. నారాయణ రెడ్డి వర్థంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. కవి, రచయిత, గేయ కావ్య కృతికర్త, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీతాల రచయితగా, తనదైన ప్రత్యేక శైలిలో తెలంగాణ పదసోయగాలను ఒలికిస్తూ సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనకారుడు సినారె అని సీఎం స్మరించుకున్నారు.

ప్రకృతి మానవ తాత్వికతను ఆవాహనం చేసుకున్న ద్రష్ట... తెలంగాణ జాతికి జ్ఞానపీఠ్ అవార్డును అందించిన సాహితీ స్రష్ట... అని సినారెను కొనియాడారు. దక్కనీ ఉర్దూ, తెలుగు భాషా సాహిత్యాలను జుగల్బందీలను చేసి, గజల్స్​తో అలాయ్ బలాయ్ తీసుకొని.. తెలంగాణ గడ్డమీద గంగాజమునా తెహజీబ్​కు సినారె సాహితీ చిరునామాగా నిలిచారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. దేశీయ, అంతర్జాతీయ భాషల్లో, తెలుగు సాహితీ లోకంలో, తెలంగాణకు ఒక ప్రత్యేకస్థానాన్ని చేకూర్చిన సినారె కృషి అజరామరమన్నారు. భాషా, సాహిత్యాలు నిలిచి ఉన్నన్నినాళ్లు ప్రజల హృదయాల్లో సి.నారాయణరెడ్డి చిరకాలం నిలిచి ఉంటారని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఇదీ చూడండి: Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'

ABOUT THE AUTHOR

...view details