తెలంగాణ

telangana

ETV Bharat / city

KCR Delhi tour : ఐపీఎస్‌ క్యాడర్ రివ్యూ చేపట్టాలని అమిత్​షాకు కేసీఆర్ వినతి - cm kcr to meet amith shah

అమిత్‌ షాను కలవనున్న సీఎం కేసీఆర్
అమిత్‌ షాను కలవనున్న సీఎం కేసీఆర్

By

Published : Sep 4, 2021, 2:03 PM IST

Updated : Sep 4, 2021, 5:33 PM IST

14:01 September 04

కేంద్ర హోంమంత్రి అమిత్​షాతో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణలో పరిపాలన అవసరాల కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల, జోన్లకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని, క్యాడర్ రివ్యూ చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. గతంలో ఉన్న 9 పోలీసు జిల్లాల సంఖ్య 20కి పెరిగిందని.. పోలీసు కమిషనరేట్లు 2 నుంచి 9కి, 4 పోలీసు జోన్లు 7కు పెరిగాయని కేంద్ర హోంమంత్రికి అందజేసిన లేఖలో సీఎం పేర్కొన్నారు. దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్​... కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్‌ షాతో 45 నిమిషాల పాటు చర్చించారు.

రెండు పోలీసు మల్టీజోన్లు కొత్తగా ఏర్పాటయ్యాయిని కేసీఆర్​ తెలిపారు. ఈ పరిస్థితుల్లో జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, జోన్ ఐజీల సంఖ్య పెరగాల్సి ఉంటుంది కాబట్టి.. ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంచాలని అమిత్​ షాకు విజ్ఞప్తి చేశారు. 2016లో ఈ అంశంపై సమీక్షించిన కేంద్ర హోంశాఖ 76 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటు మొత్తం 139 పోస్టులను మంజూరు చేసిందని పేర్కొన్నారు. అయితే పెరిగిన అవసరాల రీత్యా సీనియర్ డ్యూటీ పోస్టులను 76 నుంచి 105కు పెంచాలని.. మొత్తం పోస్టులను 195కు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రెండు రోజుల క్రితం దిల్లీలో తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ము‌ఖ్యమంత్రి.. నిన్న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలవాలని కోరారు. అక్టోబర్ లేదా నవంబర్​లో యాదాద్రి ఆలయ పున:ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు.

Last Updated : Sep 4, 2021, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details