మినీ పురపోరులో తెరాసకు ఘన విజయాన్ని అదించిన ప్రజలకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాల్టీల్లో 74 శాతం వార్డుల్లో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకు గాను.. 181 స్థానాలను తెరాసకు, 3 స్థానాలను మిత్రపక్షం సీపీఐకి కలిపి 184 స్థానాల్లో గెలిపించి తెరాసకు తిరుగులేదని మరోసారి నిరూపించారని సీఎం అన్నారు.
'తెరాసకు తిరుగులేదని ప్రజలు మరోసారి నిరూపించారు' - cm kcr on municipal elections
మినీ పురపోరులో ప్రజలు మరోసారి తెరాసకు పట్టం కట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో తెరాసకు తిరుగులేదని ఇంకోసారి రుజువైందన్నారు.
cm kcr thanks to municipality people
తెరాసనే తమ పార్టీ అని రాష్ట్ర ప్రజలు నిష్కర్షగా మరోసారి తమ అభిప్రాయాన్ని తెలిపారని కేసీఆర్ అన్నారు. తెరాసకు ఇంతటి అద్భుత విజయాన్ని చేకూర్చిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.