సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ - సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్
19:03 April 19
సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్
సీఎం కేసీఆర్‌కు కరోనా సోకింది. ఆయనకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్ తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎంకు వైద్యులు సూచించారని.. ప్రస్తుతం ఆయన తన ఫామ్‌హౌస్‌లో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక వైద్యుల బృందం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు సోమేశ్‌కుమార్ చెప్పారు.
ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యుడు ఎం.వి.రావు తెలిపారు. నిరంతరం వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు విశ్రాంతి సూచించామని వివరించారు.