తెలంగాణ

telangana

ETV Bharat / city

CM KCR National Tour: హస్తినలో సీఎం కేసీఆర్​.. జాతీయస్థాయి పర్యటన షురూ.. - దిల్లీలో కేసీఆర్​

CM KCR started to Delhi for National tour
CM KCR started to Delhi for National tour

By

Published : May 20, 2022, 4:36 PM IST

Updated : May 20, 2022, 7:24 PM IST

16:34 May 20

జాతీయస్థాయి పర్యటన నిమిత్తం దిల్లీకి కేసీఆర్​..

CM KCR National Tour: జాతీయస్థాయి పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్​ హస్తినకు చేరుకున్నారు. దేశ రాజకీయాలపై మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టిసారించిన వేళ.. జాతీయ స్థాయిలో పలు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కేసీఆర్​ దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి నేతలతో చర్చలు జరిపిన గులాబీ బాస్​ ఈ సారి జాతీయస్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతోనూ సమావేశం కానున్నారు.

సీఎం కేసీఆర్ పర్యటన ఇలా..

  • మే 20వ తేదీన (నేడు) దిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో, ప్రముఖ ఆర్థికవేత్తలతో , జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టులతో సమావేశం
  • మే 22వ తేదీన మధ్యాహ్నం దిల్లీ నుంచి చండీగఢ్​కు వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. వారికి ఆర్థికంగా భరోసానందించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్​లతో కలిసి సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
  • మే 26వ తేదీ ఉదయం బెంగళూరులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మాజీ భారత ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు.
  • మే 27వ తేదీన బెంగుళూరు నుంచి సీఎం కేసీఆర్ రాలేగావ్ సిద్ది పర్యటనకు వెళతారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం సాయిబాబా దర్శనం కోసం సీఎం కెసిఆర్ షిర్డీ వెళతారు. అక్కడ నుంచి పర్యటనలను ముగించుకుని తిరిగి హైదరాబాద్​కు చేరుకుంటారు.
  • మే 29 లేదా 30వ తేదీన బంగాల్, బిహార్ రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్నారు. గాల్వాన్ లోయలో వీరమరణం పొందిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగా వారి కుటుంబాలను సీఎం కేసీఆర్ ఆదుకోనున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : May 20, 2022, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details