తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్లేందుకు, సంస్థ మనుగడకు కొన్ని చర్యలు తప్పవని ఆయన అన్నారు. ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో చట్ట విరుద్ధంగా.. అదీ పండుగ సీజన్లో సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీపడే సమస్యే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై నిర్వహించిన సుదీర్ఘ ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం సీఎం కార్యాలయం ప్రకటన వెలువరించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు.
విలీనం చేసే ప్రసక్తే లేదు : సీఎం కేసీఆర్ - టీఎస్ఆర్టీసీ సమ్మె
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం విధించిన గడువులోగా హాజరుకాని ఉద్యోగులను తిరిగి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
![విలీనం చేసే ప్రసక్తే లేదు : సీఎం కేసీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4673045-756-4673045-1570376894912.jpg)
విలీనం చేసే ప్రసక్తే లేదు : సీఎం కేసీఆర్