తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ తర్వాతే ప్రజారవాణాపై నిర్ణయం: సీఎం - telangana taja news

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కావని.. గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లో ఆటోలకు, క్యాబ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు కేసీఆర్​ తెలిపారు. మే 15న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

kcr
ఆ తర్వాతే ప్రజారవాణాపై నిర్ణయం: సీఎం

By

Published : May 6, 2020, 12:05 AM IST

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కావని సీఎం తేల్చిచెప్పారు. గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లో ఆటోలకు, క్యాబ్‌లకు అనుమతి ఉందని తెలిపారు. మే 15న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

తెలంగాణ అభివృద్ధిలో కార్మికులు భాగస్వాములన్న సీఎం.. వలస కార్మికులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు. వలస కార్మికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్మికులు తరలింపు కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యూపీ, బిహార్‌కు వెళ్లే వలస కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా తరలిస్తామన్నారు.

అత్యవసరం ఉన్నవారు 100కు ఫోన్‌ చేస్తే పాసులు జారీ చేస్తామని.. వాటి ద్వారా ఇతర ప్రాంతాలకు కార్మికులు, ప్రజలు వెళ్లవచ్చన్నారు. ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదని సీఎం స్పష్టం చేశారు. మతపరమైన సామూహిక కార్యక్రమాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.

వివాహానికి 20 మంది... అంత్యక్రియలకు 15 మంది హాజరయ్యేందుకు అనుమతిస్తున్నట్లు సీఎం కేసీఆర్​ తెలిపారు.

ఇవీచూడండి: 'న్యాయవాదుల కోసం రూ.25 కోట్లు మంజూరు '

ABOUT THE AUTHOR

...view details