ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌పై వెనక్కి వెళ్లలేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఏ ఒక్క డిమాండ్‌నూ వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని అన్నారు. తమది అన్యాయమని తేలితే రేపే విధులకు హాజరవుతామని సవాల్ విసిరారు. తెలంగాణ వస్తే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రేపు ఇందిరాపార్కు వద్దకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో పర్యటించి కార్మికులకు ధైర్యం చెప్తామని పేర్కొన్నారు.
విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస - tsrtc strike latest news
విలీనానికి ఉన్న ఇబ్బంది ఏంటో సీఎం కేసీఆర్ చెప్పాలని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌పై వెనక్కి వెళ్లలేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
tsrtc strike