ఆర్టీసీ కార్మికులు ఎత్తుకున్నది పిచ్చిపంథా అర్థంపర్థంలేనిదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. దురంహకార పద్ధతిని ఆర్టీసీ కార్మికులు అవలంభించారని అన్నారు. చిల్లరమల్లర యూనియన్ రాజకీయాలే ఈ సమ్మెకు కారణమని పేర్కొన్నారు. ఆర్టీసీ మునగక తప్పదని...ఎవరూ కాపాడలేరని చెప్పారు. ఆర్టీసీ సమ్మె కాదు...ఆర్టీసే ముగుస్తుందని తెలిపారు.
ఆర్టీసీ ముగింపే సమ్మెకు ముగింపు: సీఎం కేసీఆర్ - cm kcr comments tsrtc strike
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే వాదన అర్థరహితమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. సమ్మెను ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నిక ముందు చేసిన పనికిమాలిన చర్యగా అభివర్ణించారు. ఆర్టీసీ సమ్మె కాదు...ఆర్టీసే ముగుస్తుందని పేర్కొన్నారు.
cm kcr