తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో గార్డెన్లు ఏర్పాటవ్వాలి : కేసీఆర్ - అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను అభినందించిన సీఎం కేసీఆర్​

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వివిధ రకాల మొక్కలతో గార్డెన్లను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

cm kcr said That effort should take place in all colleges in the telangana
'రాష్ట్రంలో అన్ని కళాశాలల్లో గార్డెన్ల ఏర్పాటు జరగాలి'

By

Published : Jul 17, 2020, 3:18 PM IST

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గార్డెన్ అభివృద్ధి చేసి, తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను సీఎం కేసీఆర్ ప్రగతి భవన్​లో ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ప్రదర్శించిన సేవా నిరతిని కొనియాడారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్​కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు.

త్వరలోనే రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న బోటనీ అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలతో గార్డెన్లను అభివృద్ధి చేసే కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :రాష్ట్రంలోని ఒక్కో వ్యక్తి తలపై రూ.లక్షన్నర అప్పు ఉంది: భట్టి విక్రమార్క

ABOUT THE AUTHOR

...view details