తెలంగాణ

telangana

ETV Bharat / city

మద్దతు ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేస్తాం: సీఎం - cm kcr latest news

మద్దతు ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేస్తాం: సీఎం
మద్దతు ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేస్తాం: సీఎం

By

Published : Oct 23, 2020, 3:02 PM IST

Updated : Oct 23, 2020, 5:35 PM IST

15:00 October 23

మద్దతు ధర చెల్లించి మక్కలు కొనుగోలు చేస్తాం: సీఎం

వరి ధాన్యం కొనుగోలు కోసం గ్రామాల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర చెల్లించి, మక్కలు కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. వానాకాలం పంటల కొనుగోలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగిన ఈ సమావేశానికి వ్యవసాయశాఖ, పౌరసరఫరాలు, మార్కెటింగ్‌శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆయాశాఖల ఉన్నతాధికారులు హాజర‌య్యారు.  క్వింటాల్‌కు రూ.1,850 మద్దతు ధర చెల్లించి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని, రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సీఎం కోరారు. మక్కలకు మద్దతు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి, వర్షాకాలంలో రైతులు మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం కోరిందని, అయినప్పటికీ రైతులు మక్కల సాగు చేశారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వద్దంటే మక్కలు సాగు చేశారని, వాస్తవానికి ప్రభుత్వానికి మక్కలు కొనుగోలు చేసే బాధ్యత లేదని సీఎం అన్నారు. అయినప్పటికీ రైతులు నష్టపోవద్దనే ఏకైక కారణంతో ప్రభుత్వం నష్టాన్ని భరించడానికి సిద్ధపడి మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ వెల్లడించారు. 
 

రైతులు న‌ష్ట‌పోతుంటే చూస్తూ ఉండ‌లేం

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే వర్షాకాలంలో మక్కలు సాగు చేయవద్దని ప్రభుత్వం రైతులను కోరింది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో పసుపుకు అంతర పంటగా కొద్ది పాటి ఎకరాల్లో మక్కలు వేసుకోవాలని సూచించింది. 

ప్రభుత్వ విజ్ఞప్తిని, వ్యవసాయాధికారుల సూచనలు పాటించకుండా కొంత మంది రైతులు మక్కలు సాగు చేశారు. మక్కలకు మద్దతు ధర రాదని తెలిసినా సాగు చేసి నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. రైతు సంక్షేమం – వ్యవసాయాభివృద్ధి కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రైతు సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నది. రైతులను సంఘటిత శక్తిగా మలిచింది. రైతులను సమన్వయ పరిచి దేశంలోనే మొదటి సారిగా నిర్ణీత పంటల సాగు విధానం అమలు అవుతుంది. ఎవరూ అడగక ముందే, ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల భూమలు వద్ద లక్ష కల్లాల నిర్మాణం చేపట్టింది. 2,600 రైతు వేదికలను నిర్మిస్తుంది. ఇన్ని పనులు చేసిన ప్రభుత్వం రైతులు నష్టపోతుంటే చూస్తూ ఉండలేక మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది - కేసీఆర్​, ముఖ్యమంత్రి.

ఇవీ చూడండి:ఉద్రిక్తత: జగిత్యాల కలెక్టరేట్​ వద్ద రైతుల ధర్నా.. అడ్డుకున్న పోలీసులు

Last Updated : Oct 23, 2020, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details