తెలంగాణ

telangana

ETV Bharat / city

నదీ జలాల్లో న్యాయమైన హక్కులను బలంగా వినిపించాలి - cm kcr on krishna board

కృష్ణా, గోదావరి బోర్డు సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్షించినట్లు సమాచారం. రెండు బోర్డులు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలపై చర్చించి అనుసరించాల్సిన విధానాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న న్యాయమైన హక్కులు, వాటాలను వివరించాలని, జరగబోయే నష్టాన్ని ఏ విధంగా చూపాలనేదానిపైనా చర్చించినట్లు సమాచారం.

cm kcr
cm kcr

By

Published : Jun 2, 2020, 6:34 AM IST

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాలు 4, 5వ తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో వాటిలో రాష్ట్రం తరఫున వినిపించాల్సిన వాదనలపై ప్రభుత్వం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు మురళీధర్‌, నాగేంద్రరావులతో పాటు సీనియర్‌ అధికారులు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఇంజినీర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. రెండు బోర్డులు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలపై చర్చించి అనుసరించాల్సిన విధానాలను ఖరారు చేసినట్లు సమాచారం.

వివరాలు సిద్ధం చేయండి

శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ఎత్తిపోతల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఏపీ పెద్ద ఎత్తున నీటిని తరలించేందుకు నిర్మాణాలు చేపట్టడాన్ని కృష్ణా బోర్డు సమావేశంలో ఎత్తిచూపాలని, శ్రీశైలం జలాశయానికి సంబంధించి మొత్తం వివరాలను సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఎదుట రాష్ట్రం గొంతుకను బలంగా వినిపించేందుకు అవసరమైన సమాచారాన్ని తెప్పించుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు.

మరోసారి భేటీ

నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న న్యాయమైన హక్కులు, వాటాలను వివరించాలని, జరగబోయే నష్టాన్ని ఏ విధంగా చూపాలనేదానిపైనా చర్చించినట్లు సమాచారం. మంగళవారం కూడా ఈ అంశాలపై మరోమారు అధికారులతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.

ఇదీ చదవండి:తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ఈసారి గిట్లనే!

ABOUT THE AUTHOR

...view details