ప్రజలకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై రేపు హైకోర్టుకు ఇవ్వనున్న నివేదికపై ప్రగతిభవన్‌లో సమీక్షించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఉన్నతాధికారులతో కలిసి సమాలోచనలు జరిపారు. కార్మిక సంఘాలతో శనివారం జరిపిన చర్చల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. చర్చలు అసంపూర్తిగా ముగిసిన విధానాన్ని తెలుసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చాలా ఓపికపట్టామని కేసీఆర్ అభిప్రాయపడ్డట్లు తెలిసింది.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి : కేసీఆర్ - cm kcr on tsrtc strike
cm kcr
15:29 October 27
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష
Last Updated : Oct 27, 2019, 8:03 PM IST