సుదీర్ఘ చర్చ
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష - tsrtc strike news
22:42 October 16
ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రగతి భవన్లో సుమారు ఐదు గంటలకు పైగా సీఎం కేసీఆర్ సమీక్షించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థంగా బస్సులు నడపడం, తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది నియామకంపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, అధికారులతో చర్చించారు. ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్‌శర్మ, రవాణా శాఖ కమిషన్ సందీప్ సుల్తానియా తదితరులు భేటీకి హాజరయ్యారు. వంద శాతం బస్సులు రోడ్డెక్కే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించినట్లు తెలిసింది. సమ్మెపై హైకోర్టు వ్యాఖ్యలపైనా సీఎం ఆరాతీసినట్లు సమాచారం.
19:05 October 16
ఆర్టీసీ సమ్మె, కోర్టు ఆదేశాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి పువ్వాడ, అధికారులు సునీల్ శర్మ, సందీప్‌కుమార్‌లతో సమ్మె ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, నిన్నటి కోర్టు ఆదేశాలపై చర్చిస్తున్నారు.