ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తాం: సమీక్షలో సీఎం కేసీఆర్ - telangana latest news
10:24 July 12
ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తాం: సమీక్షలో సీఎం కేసీఆర్
ఎస్‌ఆర్ఎస్పీ వరదకాల్వ ఎగువ ప్రాంతాల్లోని నీటి ఇబ్బందులపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తోపాటు జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు సంజయ్, విద్యాసాగర్‌రావు, రవిశంకర్, రమేశ్‌లతో సీఎం కేసీఆర్ మాట్లాడారు.
నాలుగు రోజుల క్రితం జగిత్యాల రైతుబంధు సభ్యుడు శ్రీపాల్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్... సాగునీటి ఇక్కట్లపై ఆరా తీశారు. సమస్య పరిష్కారం కోసం త్వరలోనే సమావేశం నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ఇవాళ్టి సమావేశంలో శ్రీపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో వరదకాల్వ ఎగువన ఉన్న 50వేల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించే విషయమై సమావేశంలో చర్చించారు.