నియంత్రిత పంటల సాగుపై సీఎం కేసీఆర్ సమావేశం - నియంత్రిత పంటల సాగు
13:53 May 21
నియంత్రిత పంటల సాగుపై సీఎం కేసీఆర్ సమావేశం
నియంత్రిత సాగు విధాన ఖరారు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు, కలెక్టర్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, వ్యవసాయ అధికారులతో సీఎం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. వానాకాలం నుంచే నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... 70 లక్షల ఎకరాల్లో పత్తి, 40 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని స్పష్టం చేసింది.
జిల్లాల వారీగా సాగు ప్రణాళిక ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం గత రెండు రోజులుగా విస్తృత కసరత్తు చేసింది. జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చించారు. ఆయా జిల్లాల్లోని నేలల స్వభావం, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం సహా రైతుబంధు సమితి అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకున్నారు. వాటన్నింటి ఆధారంగా జిల్లాల వారీగా వ్యవసాయ పటాలను రూపొందిస్తారు.
కలెక్టర్లు, అధికారులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులతో నియంత్రిత సాగు విధానంపై చర్చించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేస్తారు. వారి అభిప్రాయాలను తీసుకుంటారు. వాటన్నింటిని జిల్లాల వారీగా పంటల సాగు విస్తీర్ణాన్ని ఖరారు చేస్తారు.