వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆధార్ వివరాల ప్రస్తావన లేకుండా రిజిస్ట్రేషన్లు చేయాలన్న హైకోర్టు... అంతవరకు స్లాట్ల బుకింగ్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ల అంశానికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలన్న విషయమై ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానంపై తుది నిర్ణయం...!
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నారు. హైకోర్టు ఆదేశాలపై పూర్తి స్థాయిలో చర్చించి తగిన నిర్ణయాన్ని తీసుకోనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం కానున్నారు. హైకోర్టు ఆదేశాలపై పూర్తి స్థాయిలో చర్చించి తగిన నిర్ణయాన్ని తీసుకునేందుకు ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేక తగిన విదివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టాలా అన్న విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. అధికారులతో పాటు రెవెన్యూ, న్యాయ నిపుణులతో చర్చించి సీఎం కేసీఆర్ ఈ విషయమై తుది నిర్ణయానికి రానున్నారు.