కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లతో ప్రగతిభవన్‌లో సమావేశమైన సీఎం... సచివాలయ భవన నమునాపై చర్చించారు. చెన్నెకి చెందిన ఆస్కార్, పొన్ని ఆర్కిటెక్ట్‌లు, రాష్ట్ర ప్రభుత్వ వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఆస్కార్, పొన్ని ఆర్కిటెక్ట్‌లు తమ నమూనాకు సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అన్ని అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన ముఖ్యమంత్రి... కొన్ని మార్పు, చేర్పులు సూచించారు.
సచివాలయం హుందాగా, సౌకర్యవంతంగా ఉండాలి: సీఎం - సచివాలయ భవన సముదాయంపై కేసీఆర్ సమీక్ష
సచివాలయ కొత్త భవనం హుందాగా, పూర్తి సౌకర్యవంతంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్కిటెక్ట్‌ల నమూనాను పరిశీలించిన సీఎం... కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు. సచివాలయానికి సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.
సచివాలయ భవన బాహ్యరూపం ఆకర్షణీయంగా, హుందాగా ఉండాలని... లోపల అన్ని సౌకర్యాలు కలిగి పనిచేసుకోవడానికి పూర్తి అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దాలని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారులు, వారి సిబ్బంది పనిచేయడానికి అనుగుణంగా కార్యాలయాలు ఉండాలని చెప్పారు. ప్రతి అంతస్తులోనూ ఒక భోజనశాల, సమావేశ మందిరం ఉండాలని సూచించారు. ముఖ్యులు, ప్రతినిధులు, అతిథులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాళ్లు ఉండాలని స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగే పని, పనిచేసే వారి సంఖ్య, వచ్చే సందర్శకులు, తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని నిర్మాణాలు చేపట్టాలని అధికారులను సీఎం.
ఇదీ చూడండి:కరోనా విషయంలో హైకోర్టు ఏదడిగినా ఇవ్వండి: కేసీఆర్