కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష ఇవాళ జరగనుంది. న్యాయస్థానాల తీర్పుల నేపథ్యంలో... వీలైనంత త్వరగా కూల్చివేత పనులు పూర్తిచేసి, కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో సచివాలయ భవనాల సముదాయం నిర్మాణంపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. తెలంగాణ రహదార్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌లతో పాటు ఆస్కార్, పొన్ని సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.
ఇప్పటికే వివిధ నమూనాలు పరిశీలించిన ముఖ్యమంత్రి... ఆస్కార్, పొన్ని నమూనాకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు.
కొత్తగా నిర్మించే సచివాలయంలో ఉండాల్సిన సౌకర్యాలు సహా ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో చర్చిస్తారు. ఆస్కార్, పొన్ని రూపొందించిన నమూనాలు కొన్ని మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు నమూనాలు ఖరారు చేసిన అనంతరం మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుని టెండర్లు పిలిచి, భవన సముదాయ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు.
సచివాలయ భవన సముదాయ నిర్మాణంపై సీఎం సమీక్ష ఇదీ చూడండి:నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్