మిడతలదండు అంశంపై ముగిసిన సీఎం సమీక్ష - cm kcr review on midathala dandu
![మిడతలదండు అంశంపై ముగిసిన సీఎం సమీక్ష మిడతల దండుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7380256-496-7380256-1590657336277.jpg)
14:35 May 28
మిడతలదండు అంశంపై ముగిసిన సీఎం సమీక్ష
పాకిస్థాన్ నుంచి రాజస్థాన్‌లోకి, అక్కడి నుంచి రోజుల వ్యవధిలో ఒక్కో రాష్ట్రంలోకి ‘వాయు’వేగంతో తరలి వస్తున్న మిడతలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయడంపై రాష్ట్రాలు దృష్టి సారించాయి. తెలంగాణకు ఈ మిడతల ద్వారా ముప్పు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అధికారులు, వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులతో కేసీఆర్ చర్చించారు.
మిడతల దండు రాష్ట్రానికి వస్తే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, చర్యలపై భేటీ సాగింది. ఇప్పుడు ఈ మిడతల దండు ప్రయాణం తెలంగాణ వైపునకు మళ్లింది. ప్రస్తుతం రాష్ట్రానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉండగా ప్రభుత్వం అప్రమత్తమైంది.