నాగార్జునసాగర్ ఎడమకాలువ ఆయకట్టు పరిధిలో.. అన్ని లిఫ్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 కల్లా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దేవరకొండ నుంచి కోదాడ వరకు....అంచనాలు సిద్ధం చేసి.....టెండర్లు వేసేందుకు సిద్ధంగా ఉంచాలని నిర్దేశించారు. అందుకు సంబంధించి నీటిపారుదల అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోవాలన్నారు.
నల్గొండ జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు అంచనాలు సిద్ధం చేయాలి: సీఎం - తెలంగాణ తాజా వార్తలు
14:38 May 25
నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
కృష్ణాబేసిన్‌లో ప్రభుత్వం ఇటీవల నిర్మించ తలపెట్టిన లిఫ్టులు, గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల పురోగతి, వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలువల మరమ్మతులు, వాటి పరిస్థితి, తదితర సాగు నీటి అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఇటీవల నెల్లికల్లులో శంకుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికీ...అంచనాలను తయారు చేయాలని సీఎం సూచించారు. ప్రతి లిఫ్ట్‌కు వేర్వేరు అంచనాలను తయారుచేసి.. అన్నింటికీ ఒకేసారి టెండర్లు పిలవాలని ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు. వానాకాలం ప్రారంభం కాగానే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి చివరి ఆయకట్టు.. తుంగతుర్తి దాకా చెరువులు కుంటలు నింపాలని సీఎం సూచించారు.
ఇవీచూడండి:త్వరలో సూపర్ స్పైడర్లకు టీకాల పంపిణీ