బడ్జెట్ తుది కసరత్తులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సీఎం సమావేశమయ్యారు. సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రోస్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బడ్జెట్ తుది కసరత్తుపై సీఎం కేసీఆర్ సమీక్ష - cm kcr on telangan budget
రాష్ట్ర బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ నిర్వహించిన ఉన్నత స్థాయి ముగిసింది. బడ్జెట్ కేటాయింపులు, శాఖల వారీగా ప్రతిపాదనలపై కేసీఆర్ సమీక్షించారు. ఎన్నికల హామీల అమలు కోసం కేటాయింపులు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
cm kcr
బడ్జెట్ కేటాయింపులు, శాఖల వారీగా ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. బడ్జెట్ ప్రతిపాదనలకు సీఎం తుదిమెరుగులు దిద్దారు. ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా కేటాయింపులు, ప్రాధాన్యతా పథకాలకు నిధులు, ఎన్నికల హామీల అమలు కోసం కేటాయింపులు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి:గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశం
Last Updated : Mar 4, 2020, 10:51 PM IST