నాయీబ్రాహ్మణులు, రజకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరటనిచ్చే నిర్ణయం ప్రకటించారు. ఆయా వర్గాలు సమాజానికి గొప్ప సేవ చేస్తున్నారని కొనియాడిన సీఎం.. రాష్ట్ర వ్యాప్తంగా క్షౌరశాలలు, సెలూన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు.కరోనా సంక్షోభం వల్ల రాష్ట్ర ఖజానాకు 52 వేల 750 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో పరిశ్రమలు, అన్ని వర్గాల వ్యాపారులు కూడా నష్టపోయారని.. వారి విజ్ఞప్తి మేరకు కనీస విద్యుత్ ఛార్జీలు మినహాయింపు ఇస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లకు ఉచిత విద్యుత్: సీఎం కేసీఆర్ - జీహెచ్‌ఎంసీ ఎన్నికలు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెరాస మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు, సెలూన్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లకు ఉచిత విద్యుత్: సీఎం కేసీఆర్
కరోనా కాలానికి మోటారు వాహన పన్ను రద్దు చేస్తామన్నారు. పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీలకు కనీస డిమాండ్ ఛార్జీల మినహాయింపు ఇస్తామన్నారు. రాష్ట్రంలో సినిమా థియేటర్లకు హెచ్‌టీ, ఎల్టీ కేటగిరీ కనెక్షన్లకు విద్యుత్ కనీస డిమాండ్ ఛార్జీలు రద్దు చేస్తానని ప్రకటించారు.
ఇవీ చూడండి: గృహవినియోగదారులకు ఉచితంగా నీటి సరఫరా: కేసీఆర్