- కుల, మతాలు పక్కన పెట్టి జనమంతా పిడికిలి బిగించాలి
- అప్పుడే దేశ ప్రగతిని సాధించగలం
- రాజకీయ ఫ్రంట్‌ను ఊహించొద్దు.. ప్రజల ఫ్రంట్‌ను ఊహించండి
- నేను ముంబయి వెళ్తా.. ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తా
- ఏదేమైనా ఈ విషయంలో నేను కీలక పాత్ర పోషిస్తా
- దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు
- ప్రజల కోసం పని చేస్తూ పోతే పదవులు అవే వస్తాయి
- ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి సినిమా నటులు సీఎంలు కాలేదా?
LIVE UPDATES: 'ఏదేమైనా ఈ విషయంలో నేను కీలక పాత్ర పోషిస్తా'
CM KCR PRESS MEET LIVE UPDATES
19:43 February 13
నేను ముంబయి వెళ్తా.. ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తా
19:29 February 13
- ప్రజలు కలిసి వస్తే.. నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుంది
- కఠోర సమైక్యవాదినన్న చంద్రబాబు జై తెలంగాణ అనలేదా?
- సమైక్యవాద పార్టీ సీపీఐ జై తెలంగాణ అనలేదా?
- ఈ దేశం కోసం ముందు కదలాల్సింది దేశ ప్రజలే
- జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరు..
- అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ పెడతా
19:24 February 13
- గవర్నర్ వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదని సర్కారియా కమిషన్ చెప్పింది
- గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం భాజపా హయాంలో పెరిగింది
- దేశంలోని అన్ని రాజకీయ శక్తులు ఏకమై భాజపాను వెళ్లగొట్టాలి
- భవిష్యత్ రాజకీయాలను ఊహించి చెప్పలేం
- భాజపా అరాచక పాలనపై దేశమంతా చర్చ జరగాలి
- ఎవరు ఎవరితో కలుస్తారు అన్నది కాలం చెబుతుంది
19:18 February 13
- హిజాబ్ పై దేశం మొత్తం మౌనం వహిస్తోంది
- కర్ణాటకలోని విద్వేషం అంతటా వస్తే దేశం గతేంటి..?
- ధర్మం పేరిట విద్వేష రాజకీయం మానుకోవాలి
19:18 February 13
- తెలంగాణలా దేశం మారాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.. తప్పా..
- దళితుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని చెబుతున్నా
- దళితుల రిజర్వేషన్లు 19 శాతానికి పెంచాలని రాజ్యాంగం మార్చమంటున్నా
- దేశమంతా దళిత బంధు పెట్టడం కోసం రాజ్యాంగం మార్చమంటున్నా
- బీసీల కులగణన కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా
- రాజ్యాంగం ప్రగతిశీలంగా ఉండాలని అంబేడ్కరే చెప్పారు
- గుజరాత్‌లో దళిత బిడ్డలను చంపేస్తున్నారు
- గుజరాత్‌లో దళిత బిడ్డల ఊరేగింపులను సహించలేకపోతున్నారు
- 77 శాతం సంపద 10 శాతం మంది దగ్గర ఉండొద్దు
- 77 శాతం సంపద 90 శాతం మంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కావాలి
- అందరికీ సమాన హక్కుల కోసం కొత్త రాజ్యాంగం కావాలి
19:10 February 13
- రాహుల్ గాంధీ పట్ల అసోం సీఎం వ్యాఖ్యలు సమంజసమేనా?
- రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని వదిలిపెట్టను
- అసోం సీఎంను భాజపా ప్రోత్సహిస్తోందా..?
- అసోం సీఎంపై భాజపా ఎందుకు చర్యలు తీసుకోలేదు?
- కాంగ్రెస్‌తో పొత్తు కోసం రాహుల్‌ను వెనకేసుకొస్తున్నానని అంటున్నారు
- తెరాసకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు
19:06 February 13
- దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారు?
- భాజపా విద్వేష రాజకీయాల గురించి యువత ఆలోచించాలి: కేసీఆర్
- శాంతి లేని చోట ఎవరు పెట్టుబడులు పెడతారు: కేసీఆర్
- శాంతిభద్రతలు కోరుకుందామా?.. ఘర్షణలు, కర్ఫ్యూలు కోరుకుందామా?
18:58 February 13
- మోదీ ట్రంప్ తరపున అమెరికాలో ప్రచారం చేశారు
- మోదీ అమెరికా ఎన్నికల్లో ప్రచారం చేయడం ఏంటి?
- అమెరికా ఎన్నికలు.. అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలా?
- అమెరికా ఎన్నికల కోసం మోదీ ప్రచారం వ్యూహాత్మక తప్పిదం
18:46 February 13
మీకు దమ్ముంటే నన్ను జైలుకు పంపాలి కదా..
- మీకు దమ్ముంటే నన్ను జైలుకు పంపాలి కదా..
- మేం మిమ్మల్ని జైలుకు పంపేది మాత్రం పక్కా
- భాజపా పాలకుల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది
- రఫేల్ జెట్ విమానాల కొనుగోలులో గోల్‌మాల్ జరిగింది
- మన కంటే చౌకగా ఇండోనేషియా రఫేల్ విమానాలు కొన్నది
- భాజపా అవినీతి గురించి దిల్లీలో పంచాయితీ పెడతా
- భాజపా తన సిద్ధాంతాలు గాల్లో కలిపేసింది
- ఎన్నికల్లో గెలవకపోయినా పాలించే సిగ్గులేని పార్టీ భాజపా
- కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్ గెలవకపోయినా పాలిస్తున్నారు
- మహారాష్ట్రలోనూ గెలవకపోయినా పాలించాలని యత్నించారు
- మహారాష్ట్రలో పాలిద్దామని యత్నించి బోల్తా పడ్డారు
- యూపీ ఎన్నికల తర్వాత పెట్రోల్ రేట్లు పెంచుతారు
18:39 February 13
- విద్యుత్ సంస్థలు నిర్మించినా ఉత్పత్తి కానివ్వట్లేదు
- విద్యుత్ లేక దేశంలో 60 శాతం అంధకారంలో ఉంటుంది
- తెలంగాణ తప్ప 24 గంటల విద్యుత్ ఏ రాష్ట్రం ఇవ్వలేదు
- విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలనేది కేంద్రం ఉద్దేశం
- పార్టీలకు చందాలు ఇచ్చేవాళ్లను ప్రోత్సహిస్తున్నారు
- చందాలు ఇచ్చే సంస్థల సోలార్ విద్యుత్ కొనాలంటున్నారు
18:36 February 13
బహిరంగ సభలో ప్రధాని పచ్చి అబద్దాలు చెప్పారు
- మిషన్ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి ప్రధానిని పిలిచా
- బహిరంగ సభలో ప్రధాని పచ్చి అబద్దాలు చెప్పారు
- యూనిట్‌కు రూ.11 చొప్పున కొని రూ.1.10కే రాష్ట్రాలకు ఇచ్చినట్లు చెప్పారు
- కేంద్రం ఎన్నడూ రూ.1.10కు ఏ రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వలేదు
- కేంద్ర అబద్దాలపై చర్చకు రావాలన్నా భాజపా నేతలు ముందుకు రారు
- దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉన్నా.. వాడే తెలివి కేంద్రానికి లేదు
18:14 February 13
తెలంగాణ రైతులు ధనవంతులు కావాలి
- రాష్ట్రానికి అరశాతం ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తే రూ.5 వేల కోట్లు వస్తాయి
- కేంద్ర నిబంధనతో ఐదేళ్లకు రాష్ట్రం రూ.25 వేల కోట్లు నష్టపోవాలి
- ఎఫ్‌ఆర్‌బీఎం లేకపోయినా సంస్కరణలకు అంగీకరించలేదు
- తెలంగాణలో వ్యవసాయం స్థిరీకరణ జరగాలి..
- తెలంగాణ రైతులు ధనవంతులు కావాలి
- నీటి ప్రాజెక్టులపై పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాలు ఇస్తుంది
- చెల్లింపు రికార్డు బాగుంటుందని రాష్ట్రానికి రుణాలు ఇస్తారు
- విద్యుత్ సంస్కరణలు అమలు చేయట్లేదని కేంద్రం ఒత్తిడి తెస్తోంది
- రుణాలు నిలిపివేయాలని విద్యుత్ మంత్రి ఒత్తిడి తెస్తున్నారు
15:00 February 13
LIVE UPDATES: సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ లైవ్ అప్డేట్స్
- దేశం నష్టపోయిన అంశాలపై పుస్తకాలు వెలువడుతున్నాయి: సీఎం
- చరిత్రను కప్పిపుచ్చి గోల్‌మాల్ చేస్తున్నారు: సీఎం కేసీఆర్
- జనగామ, యాదాద్రి బహిరంగ సభల్లో ప్రసంగించా
- బహిరంగ సభల్లో అన్నిఅంశాలు సమగ్రంగా చెప్పలేము
- విద్యుత్ సంస్కరణలపై కేంద్రం ముసాయిదా బిల్లు చేసింది
- ముసాయిదా బిల్లును పలు రాష్ట్రాల సీఎంలకు పంపారు
- విద్యుత్ సంస్కరణల ముసాయిదా బిల్లుపై కేంద్రానికి లేఖ రాశా
- కేంద్ర ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం
- విద్యుత్ సంస్కరణలకు అదనపు రుణాలు తీసుకుంటున్నారు
- అదనపు రుణాల విషయమై కేంద్ర బడ్జెట్‌లోనూ చెప్పారు
- సాగు రంగంలో అభివృద్ధి ఆశాజనకంగా లేదు
- రంగాలవారీగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది
- వందశాతం మీటరింగ్‌పై డిస్కంలు చర్యలు తీసుకోవాలి
- పాలసీ ప్రకారం వినియోగదారులకు ఏడాదిలోగా మీటర్లు పెట్టాలి
- బిల్లు ఆమోదానికి ముందే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు
- సంస్కరణలు అమలుచేస్తే అరశాతం ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తామన్నారు
- అరశాతం ఎఫ్‌ఆర్‌బీఎం ఐదేళ్లపాటు ఇస్తామన్నారు
- కేంద్ర విద్యుత్ సంస్కరణలకు తెలంగాణ అంగీకరించలేదు
- కేంద్ర ముసాయిదా బిల్లుకు ఏపీ అంగీకరించింది
- శ్రీకాకుళంలో 25 వేల వ్యవసాయ మీటర్లు ఏర్పాటు చేశారు
- మిగతా విద్యుత్ మీటర్లకు రూ.737 కోట్లతో టెండర్లు పిలిచారు
- ప్రధాని మోదీ చెప్పేది ఒకటి..చేసేది ఒకటి
Last Updated : Feb 13, 2022, 7:45 PM IST