రాయలసీమను రతనాలసీమ చేసేందుకు సహకరిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సి ఉందని అన్నారు. గోదావరి జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని పేర్కొన్నారు. వృథాగా పోయే నీటిని వాడుకుంటే బంగారు పంటలు పండుతాయని వెల్లడించారు. ఏపీకి యువ నాయకుడు, పట్టుదలతో పనిచేసే సీఎం ఉన్నారని... అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరం సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.
'రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సిఉంది' - kcr on jagan
తమిళనాడు పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ చిత్తూరు జిల్లా, నగరి చేరుకున్నారు. ఏపీఐఐసీ ఛైర్పర్సన్, స్థానిక ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి రేణిగుంట చేరుకుని హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు.
!['రాయలసీమకు గోదావరి జలాలు రావాల్సిఉంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4117058-53-4117058-1565619084728.jpg)
cm kcr
రాయలసీమను రతనాలసీమ చేసేందుకు సహకరిస్తా: సీఎం కేసీఆర్