తెలంగాణ పోరాటయోధుడు బూర్గుల నర్సింగరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. సాయుధ రైతాంగ పోరాటంలో... తొలి, మలి దశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాల్లోనూ నర్సింగరావు పాత్ర మరువలేనిదని సీఎం కొనియాడారు.
బూర్గుల నర్సింగరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం - burgula narsing rao history
తెలంగాణ ఉద్యమ నేత బూర్గుల నర్సింగరావు మృతి పట్ల సీఎం కేసీఆర్ ప్రగాఢ సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమాల్లో బూర్గుల ప్రత్యేక పాత్ర పోషించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

cm kcr pay condolences to burgula narsing rao
ఎన్నో కమ్యూనిస్టు, ప్రగతిశీల ఉద్యమాలను బూర్గుల ముందుండి నడిపించారని గుర్తు చేసుకున్నారు. నర్సింగరావు మరణం రాష్ట్రానికి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బూర్గుల కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి: తెలంగాణ ఉద్యమ నేత బూర్గుల కన్నుమూత
Last Updated : Jan 18, 2021, 3:43 PM IST