తెలంగాణ

telangana

ETV Bharat / city

వీరులారా... మీకు దేశం సెల్యూట్ చేస్తోంది​ : సీఎం కేసీఆర్ - ప్రధాని మోదీతో కేసీఆర్​

దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని... అందుకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు అండగా నిలుస్తామని ప్రధాని నిర్వహించిన వీడియోకాన్ఫరెనస్​లో ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు.

cm kcr participated in video conference with pm modi
'వీరులారా... దేశం మీకు సెల్యూట్​ చేస్తోంది'

By

Published : Jun 17, 2020, 7:29 PM IST

దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్​లో భారత్–చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణ అంశాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.

చైనా గానీ, మరే దేశంగానీ.. భారత్ సార్వభౌమత్వం విషయంలో వేలు పెడితే, తప్పక ప్రతిఘటించాలని, తగిన సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు. దేశ రక్షణ విషయంలో ఎవరూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయమని సీఎం అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభంలో ప్రధాన మంత్రితో పాటు, అందరు ముఖ్యమంత్రులు లడాఖ్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో చనిపోయిన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.

ఇదీ చూడండి:ఆరు దశాబ్దాల నాటి ప్లాన్​తోనే భారత్​పై చైనా గురి!

ABOUT THE AUTHOR

...view details