నకిరేకల్‌తోపాటు పాటు మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని లక్షల ఎకరాలకు సాగునీరందించే..... బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేసిన అభ్యర్థన మేరకు ఉదయ సముద్రం ప్రాజెక్టు సత్వరమే పూర్తికావడానికి భూసేకరణ, టన్నెల్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని, అవసరమైన మేరకు నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను పూర్తి చేసేందుకు కావల్సిన చర్యలను వేగవంతం చేయాలి సీఎం స్పష్టం చేశారు.
ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి: సీఎం - telangana varthalu
బ్రాహ్మణవెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నకిరేకల్ ఎమ్మెల్యే లింగయ్య అభ్యర్థన మేరకు స్పందించిన కేసీఆర్... ప్రాజెక్టు కోసం అవసరమైన నిధులు విడుదల చేయాలని సూచించారు.
![ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి: సీఎం cm kcr orders on udaya samudram project in nalgonda district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10052982-570-10052982-1609282798438.jpg)
ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి: సీఎం
Last Updated : Dec 30, 2020, 6:27 AM IST