వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్ - విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక ప్రక్రియ
21:30 August 26
వీసీల నియామక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సెర్చ్ కమిటీల నియామకం పూర్తయిందని తెలిపారు. వీసీల ఎంపికకు సంబంధించిన కసరత్తు జరుగుతుందని అన్నారు.
కరోనా కారణంగా నియామకాల్లో జాప్యం జరిగిందని పేర్కొన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీసీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. వీసీల నియామక ప్రక్రియను సీఎస్ స్వయంగా పర్యవేక్షించాలని కేసీఆర్ సూచించారు.
ఇదీ చూడండి :త్వరలోనే యాదాద్రి పర్యటనకు సీఎం కేసీఆర్!